2 నెలల్లో ఎవరెక్కడ ఉంటారో తెలుస్తుంది: జగన్ ఎమ్మెల్యేలపై కిరణ్

ఆయా ఎమ్మెల్యేలపై స్పష్టత వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెసుకు 40 శాతం ఓటింగ్ ఉందని ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ఎవరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. మన ముందు ప్రస్తుతం తెలంగాణ సమస్యతో పాటు మరో వ్యక్తి సమస్య ఉందని సిఎం చెప్పారు. అయితే కాంగ్రెసు పటిష్టంగా ఉంటుందని, ఒకరిద్దరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. నాకు రాజకీయాలు తెలుసునన్నారు. గతంలో జగన్ వెంట వెళ్లిన వారు కొందరు వెనక్కి తిరిగి వచ్చారని, మళ్లీ కొత్తగా కొందరు వెళుతున్నారన్నారు. రెండునెలల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుందన్నారు. పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని చోట కాస్త సమస్యగానే ఉందని సిఎం అన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications