ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో వైయస్ జగన్ వెయిటింగ్

ప్రధానికి ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల పట్టడం లేదని ఆరోపించారు. ఏపిలోని సమస్యలపై ప్రధానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. తాను వచ్చింది బల పరీక్షకు కాదని రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రధాని దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకు రావడానికే వచ్చానని చెప్పారు. ప్రధాని అపాయింట్‌మెంటు కోసం ఇంతకుముందు ప్రయత్నాలు చేసినప్పటికీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయం కోసం అపాయింట్‌మెంట్ ఇవ్వమని లేఖ రాసినా ఇప్పటి వరకు ప్రధాని స్పందించలేదని ఆరోపించారు. మంగళవారం ప్రధానిపై ఘాటుగా వ్యాఖ్యానించిన జగన్ బుధవారం మాత్రం అపాయింట్‌మెంట్ కోసం ప్రత్యేకంగా ఆగిపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications