సూరి హత్య కేసులో యువనేత హస్తం: ఎబిఎన్ చానెల్ వార్తాకథనం

సూరి హత్య కేసులో తన పాత్ర ఉందనే విషయంపై ఎవరిని అడిగి వార్తాకథనం ప్రసారం చేశారని ఆయన అడిగారు. తనకు ఇద్దరు ఎస్కార్టులుండగా ఎలా అజ్ఞాతంలోకి వెళ్తానని ఆయన అన్నారు. మీరు అజ్ఞాతంలోకి వెళ్లారని అనలేదని, బెంగళూర్ వెళ్లి వచ్చారని మాత్రమే చెప్పామని ఎబిఎన్ చానెల్ ప్రతినిధి చెప్పారు. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయి కాబట్టే వార్తాకథనాన్ని ప్రసారం చేశారని చెప్పారు. దాంతో సంతృప్తి చెందని మంగలి కృష్ణ చానెల్‌పై తీవ్రంగా మండిపడ్డారు.
సూరి హత్య కేవలం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది మాత్రమే కాదని, అది రాజకీయ హత్య అని ఎబిఎన్ చానెల్ వ్యాఖ్యానించింది. సూరి రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకున్నారని, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వర్గంలో చేరాలని నిర్ణయించుకున్నాడని చెప్పింది. పరిటాల రవి హత్య కేసులో సూరి కేవలం పాత్రధారి మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని, పరిటాల రవి హత్య కేసు విచారణ ముగింపు దశలో ఉందని, ఈ స్థితిలో సూరి అప్రూవర్‌గా మారేందుకు అవకాశాలున్నాయని, సూరి అప్రూవర్‌గా మారితే పరిటాల రవి హత్య వెనక సూత్రధారులు బయటపడతారని, దీంతోనే భాను కిరణ్‌ను వాడుకుని సూరిని హత్య చేయించారని ఎబిఎన్ చానెల్ వివరించింది.
పరిటాల రవి హత్య కేసులో మెజిస్ట్రేట్‌ను బదిలీ చేయించారని, ఇందుకు డబ్బులు కూడా చేతులు మారాయని ఆరోపించింది. సూరి నుంచి ఉన్న ముప్పును గమనించే సూత్రధారులు భాను చేత సూరిని హత్య చేయించారని ఆరోపించింది. ఈ వ్యవహారమంతటిలో సూరి అనుచరుడు మంగలి కృష్ణ యువనేతతో చేరాడని వ్యాఖ్యానించింది. ఈ వార్తాకథనం ప్రసారమైన వెంటనే మంగలి కృష్ణ ఫోన్‌లైన్లోకి వచ్చి తీవ్రంగా మండిపడ్డారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications