వెధవ చానెళ్లు, చెప్పు తీసుకుని కొడ్తా: మీడియాపై నిర్మాత కళ్యాణ్

రక్త చరిత్ర సినిమా సమయంలో భాను కిరణ్ పరిచయమని, రక్త చరిత్ర సినిమాకు సమన్వయకర్తగా భాను వ్యవహరించాడని, భాను సినిమా నిర్మాణానికి లోకేషన్స్ చూపించాడని, అలాగంటే పరిటాల రవి అనుచరులు కూడా లోకేషన్స్ చూపించాడనిఆయన వివరించారు. భానుతో పరిమిత పరిచయం మాత్రమే ఉందని ఆయన చెప్పారు. తనతో పరిచయం అయ్యే నాటికి భాను చెడ్డవాడని నిర్ధారణ అయిందా అని ఆయన అడిగారు. సూరి హత్యకు ముందు భాను చెడ్డవాడని నిర్ధారణ అయిందా అని ఆయన ప్రశ్నించారు. తనను అడగకుండా టీవీ9, ఎన్టీవి వార్తాకథనాలు ప్రసారం చేశాయని, టీవీ9 డబ్బులు తీసుకుని వార్తాకథనం ప్రసారం చేసిందని ఆనయ ఆరోపించారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు తన వివరణ తీసుకోవాల్సి ఉందని, తన వివరణపై నమ్మకం కలగపోతే పరిశోధన చేయాలని ఆయన అన్నారు. వ్యాపారం చేసేటప్పుడు అందులో భాగంగా పరిచయాలు అవుతాయని ఆయన అన్నారు.
నీకు మాట్లాడే అర్హత లేదని ఎన్టీవి ప్రతినిధిని ఆయన కసురుకున్నారు. నువ్వెలా పరిచయం అయ్యావు, ఎన్టీవి మైక్ పట్టుకుని వస్తేనే కదా అని ఆయన అన్నారు. తన భూమిని ఎవరో ఆక్రమిస్తే తనది తాను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించానని, దానిపై తప్పుడు కథనాలు ఇచ్చారని ఆయన అన్నారు. భాను ఎలాంటివాడని ప్రశ్నిస్తే చాలా మంచివాడని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తాను 40 సినిమాలు తీశానని, డబ్బుల కోసం ఎవరినో ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మీ చానెల్‌లో భాను పెట్టుబడులు పెట్టాడని ఆయన ఎన్టీవి ప్రతినిధిని ఉద్దేశించి అన్నారు. మీరు రుజువు చేయగలరా అని అడిగితే భాను వచ్చి రుజువు చేస్తాడని ఆయన అన్నారు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని ఆయన చెప్పారు. కళ్యాణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తనకు తెలియదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ అన్నారు.












Click it and Unblock the Notifications