వైయస్ జగన్‌ తో ఎంత మంది, కిరణ్‌ ను ఆరా తీసిన నరసింహన్

Kiran Kumar Reddy-Narasimhan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట ఎంత మంది శాసనసభ్యులుంటారనే విషయంపై గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. వారిరుపురి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. జగన్ వెంట కేవలం 10 - 15 మంది శాసనసభ్యులు మాత్రమే వెళ్తారని, ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని కిరణ్ కుమార్ నరసింహన్ ‌తో చెప్పినట్లు సమాచారం. జగన్‌తో 30 మంది దాకా శాసనసభ్యులు వెళ్లినా ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా అని గవర్నర్ అడిగినట్లు సమాచారం.

జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు అవిశ్వాస తీర్మానం వస్తే ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేస్తారని, తాము ప్రభుత్వాన్ని పడగొట్టబోమని జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు కూడా చెబుతున్నారని కిరణ్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే ప్రజారాజ్యం, మజ్లీస్ సభ్యులు ఆదుకుంటారని కూడా ఆయన వివరించినట్లు సమాచారం. జగన్ ప్రభావం ప్రభుత్వ మనుగడపై ఏ విధమైన ప్రభావం వేస్తుందనే విషయంపై కూడా ఇరువురి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+