కాంగ్రెసు నేతల రాజీనామా కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థులు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వర్సింగాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయకుంటే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. పోలీసులు, స్థానికులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర కోసం టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ కరీంనగర్ జిల్లాలోనే ఓ గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన సంఘటన మరువకముందే అదే తీరులో వీరు నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications