వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలిక రేప్ కేసులో బిఎస్‌ పి ఎమ్మెల్యే ఆరెస్టుకు మాయ గ్రీన్ సిగ్నల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
న్యూఢిల్లీ: ఓ దళిత బాలిక రేప్ కేసులో బిఎస్‌పి శాసనసభ్యుడు పురుషోత్తం ద్వివేది అరెస్టుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ద్వివేది ఓ బాలికను రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. తన అధికారిక నివాసంలో 17 బాలికను ద్వివేది రేప్ చేసినట్లు సిబి - సిఐడి గుర్తించింది. అతని అనుచరులు రాజేంద్ర శులా, సురేంద్ర నేత, రావణ్ గర్జ్ ఆమెపై లైంగిక దాడికి దిగినట్లు సాక్ష్యాలను సేకరించింది.

ఆ దళిత బాలిక దొంగతనం చేసినట్లు వచ్చిన ఆరోపణలను దర్యాప్తు సంస్థ కొట్టిపారేసింది. సిబిసిఐడి ప్రాథమిక నివేదికను సమర్పించిన వెంటనే శానససభ్యుడిపై, అతని ముగ్గురు అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శాసనసభ్యుడితో పాటు అతని ముగ్గురు అనుచరుల అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ కార్యదర్శి శశాంక్ శేఖర్ సింగ్ చెప్పారు. ద్వివేదిని బిఎస్‌పి నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X