చంద్రబాబు పావులు దేవేందర్, రేవంత్ రెడ్డి: నాగం జనార్దన్ రెడ్డికి చెక్

దేవేందర్ గౌడ్, రేవంత్ రెడ్డిలపై రాజ్ న్యూస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, నవ తెలంగాణ పార్టీని పెట్టడానికి ముందు దేవేందర్ గౌడ్ చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను గుర్తు చేస్తోంది. తెలుగుదేశం ఏకవ్యక్తి పార్టీ అంటూ చంద్రబాబు తీరును అప్పట్లో దేవేందర్ గౌడ్ తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను రాజ్ న్యూస్ పూర్తిగా ప్రసారం చేసింది. రేవంత్ రెడ్డిని తాచుపాములా అభివర్ణించింది. మాటలకు బురద పాము అని వ్యాఖ్యానించింది. ప్రజల్లోకి వెళ్తే బండబూతులు తిడతారని రేవంత్ రెడ్డికి తెలుసునని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications