అమ్మ విజయలక్ష్మిపై పోటీకి ఉత్సాహం: వైయస్ వివేకాపై వైయస్ జగన్

వదినపై పోటీ చేయడం ద్వారా వివేకానంద రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి ఏం గౌరవం ఇచ్చినట్లని, దానివల్ల వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించదా అని ఆయన ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనను వ్యతిరేకించే వారికు బుద్ధి చెప్పాలని ఆయన పిలువునిచ్చారు. బిజెపితో పొత్తు పెట్టుకోబోనని ముస్లిం సోదరులకు మాట ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మాట కోసం తాను పార్లమెంటుకు రాజీనామా చేశానని, సోనియాతో కొట్లాడడానికి వెనకాడడం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications