తెలుగుదేశం తెలంగాణ నేతల మధ్య అనైక్యతే చంద్రబాబు వరం

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి విసుగు చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒక్కరొక్కరు పార్టీని వీడిపోయినా చంద్రబాబు పెద్ద పట్టించుకోరనే విషయం అనుభవంలో ఉన్నదే.
కాగా, తెలంగాణకు అనుకూలంగా లేని టి. దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి నాయకులతో చంద్రబాబు తెలంగాణ వ్యవహారాలను నడపాలని అనుకుంటున్నారు. పార్టీలో తెలంగాణ నాయకుల మధ్య తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి శనివారం అన్నారు.
ఈ ఏకాభిప్రాయం లేకపోవడాన్నే చంద్రబాబు ఆయుధంగా ఎంచుకున్నారని చెప్పవచ్చు. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న నాయకులకు రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ వంటి నాయకులను పోటీకి దించుతున్నారు. ఒక రకంగా తెలంగాణ నేతల మధ్య విభేదాలను చంద్రబాబే పెంచి పోషిస్తున్నారని చెప్పవచ్చు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications