శబరిమలలో తొక్కిసలాటలో 21 మంది ఆంధ్ర భక్తుల మృతి

హైదరాబాద్‌: శబరిమల తొక్కిసలాటలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది మరణించారు. వీరిని గుర్తించారు. వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు, మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక్కరు, కరీనంగర్ జిల్లాకు చెందిన ఒక్కరు, నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఇద్దరు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకరు కూడా ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. ఇతన్ని మహబాబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిగా గుర్తించారు. బోధన్‌కు చెందినవారిలో ఒకరిని రాజకుమార్‌గా గుర్తించారు.

ప్రకాశం జిల్లా చీరాల విఠల్‌నగర్ చెందిన రాజు, మంగు, రాంబాబు, సూరయ్య, గణేష్‌లుగా గుర్తించారు. మెదక్ జిల్లా గజ్వెల్‌కు చెందిన తండ్రీకొడుకులు రామచంద్ర, అరణ్‌లు ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరుకు చెందిన దొమ్మాటి సర్వేశం, కృష్ణా జిల్లా కౌతవరం గ్రామానికి చెందిన బత్తిన ప్రసాద్, నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన శ్రీను, కోదాడ కొమరబండకు చెందిన రాంబాబు ఉన్నట్లు గుర్తించారు. ఇతర జిల్లాకు చెందినవారు కూడా కొంత మంది మరణించినట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని సమాచారం.

కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారి మృతదేహాలను విమానంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వాటిని రోడ్డు మార్గంలో స్వస్థలాలకు పంపుతారు. కొన్ని మృతదేహాలను విమానం ద్వారా విశాఖపట్నానికి తరలిస్తున్నారు. శబరిమల తొక్కిసలాటలో ఇప్పటి వరకు మొత్తం 106 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+