"డీకే వద్దన్నాక ఒంటరైన విజయ్"-ఎంకే స్టాలిన్ చెడుగుడు..!

మెకెదాకు డ్యామ్ విషయంలో జోసెఫ్ విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా కర్నాటకు ప్రభుత్వం తమ వద్దకు చర్చలకు రావొద్దని తేల్చిచెప్పేసిన నేపథ్యంలో విజయ్ ను టార్గెట్ చేస్తూ స్టాలిన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇందులో కర్ణాటకతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ముందుగానే హెచ్చరించినా.. విజయ్ ఆ సూచనలను పట్టించుకోకుండా కర్ణాటకతో సంప్రదింపులకు ప్రయత్నించారని స్టాలిన్ ఆక్షేపించారు.

విజయ్ కు మద్దతుగా స్టాలిన్ ..! కేంద్రానికి భారీ ఝలక్..!
విజయ్ కు మద్దతుగా స్టాలిన్ ..! కేంద్రానికి భారీ ఝలక్..!

తమిళనాడుకు కావేరి జలాలను ఇవ్వలేమని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించిన రాష్ట్రంతో చట్టపరంగానే పోరాడాలని గత అనుభవాలు చెబుతున్నాయని స్టాలిన్ గుర్తుచేశారు. అయినా కర్ణాటక వెళ్లి సమస్యను పరిష్కరించవచ్చని విజయ్ భావించారని విమర్శించారు.
కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని ఆదేశించిన తర్వాత కూడా, ప్రస్తుతం రావాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం విజయ్ కు చెప్పిందని స్టాలిన్ ఆరోపించారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి తాము హెచ్చరించామని గుర్తుచేశారు. ఇకనైనా కావేరి లాంటి తమిళనాడు జీవనాధార సమస్యపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని విజయ్ ను డిమాండ్ చేశారు.

MK Stalin says cm vijay stands isolated after Karnataka snub over Mekedatu demands all-party meet
మళ్లీ విజయ్ వర్సెస్ గవర్నర్ : తమిళ గీతానికి అవమానం- బాయ్ కాట్ చేసిన మంత్రి..!
మళ్లీ విజయ్ వర్సెస్ గవర్నర్ : తమిళ గీతానికి అవమానం- బాయ్ కాట్ చేసిన మంత్రి..!

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగస్టు 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర రాజకీయ పార్టీల ఐక్యతను చాటారని, అయితే తమిళనాడులో మాత్రం ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదని స్టాలిన్ ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు? అసలు నిర్వహించగలరా లేదా?" అని ఎంకే స్టాలిన్ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో విజయ్ కు సూటి ప్రశ్నలు సంధించారు. మెకెదాతు విషయంలో కర్నాటక-తమిళనాడు మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ స్టాలిన్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+