తెలంగాణను ఇతరులపై వేసి కేంద్రం తప్పించుకునే యత్నం: టిడిపి

తెలంగాణకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. పార్టీ పరంగా తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలను అన్నారు. పార్టీ తెలంగాణకు కట్టుబడి లేకుంటే వెంటనే రాజీనామా చేసి బయటకు రావాలని వారిని కోరారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి, నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని స్థానిక పార్టీలమీదకు నెట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే యత్నం చేస్తుందని కడియం ఆరోపించారు. తెలంగాణ ఫోరం ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం తెలంగాణ టిడిపి ఉద్యమిస్తుందన్నారు. కాగా సోమవారం నాటి రహదారుల బంద్‌కు సహకరించాలని ఉద్యోగ సంఘాలు కోరగా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నాగం జనార్ధన్‌రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications