భాను కిరణ్ బినామీలు అమ్మాయిలే, ప్రముఖుల పేర్లూ బయటకు?

కాగా, భానుదిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ను పోలీసులు ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపినట్లు తెలుస్తోంది. అది తెరుచుకుంటే భాను సంబంధాలపై మరిన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు. పలువురు ప్రముఖుల గుట్టు దాని ద్వారా బయటపడవచ్చునని అంటున్నారు. సినీ ప్రముఖులతో భాను పరిచయాలు దాని ద్వారా వెల్లడి కావచ్చునని చెబుతున్నారు. సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ను పోలీసులు ఇప్పటికే రెండు సార్లు గంటల తరబడి విచారించారు. మరింత సినీ ప్రముఖులను కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. భాను కిరణ్ ల్యాప్‌టాప్‌ను తెరిచిన తర్వాత చాలా విషయాలు బయట పడవచ్చునని భావిస్తున్నారు.
ఇదిలా వుంటే, సూరి హత్యకు ఐదు గంటల ముందు భాను, అతని అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుంచి 60 లక్షల రూపాయల దాకా డ్రా చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. భాను, అతని అనుచరుల పేరు మీద 18 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. సూరి హత్యకు ఐదు గంటల ముందు విజయవాడలోని ఓ బ్యాంక్ నుంచి 18 లక్షలు, హైరాబాదులోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ బ్యాంకుల నుంచి 8 లక్షల రూపాయలు, మెదక్ జిల్లాలోని ఓ బ్యాంక్ నుంచి 13 లక్షల రూపాయలు, మహబూబ్‌నగర్‌లోని ఓ బ్యాంకు నుంచి 20 లక్షల రూపాయలు డ్రా చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ డబ్బులు హవాలా రూపంలో దుబాయ్ చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, భాను కిరణ్ ఐసిఐసిఐ బ్యాంకు నుంచి స్కోడాలారా కారు కొనుగోలుకు ఏడు లక్షల రూపాయల అప్పు తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎనిమిది నెలల పాటు వాయిదాలు సక్రమంగా చెల్లించాడని, ఆ తర్వాత డిఫాల్టర్‌గా మారాడని, దాంతో మార్కెట్ ఏజెంట్లు ఆ కారును రికవరీ చేసుకున్నారని, వారిని బెదిరించి భాను కిరణ్ తిరిగి కారు తెచ్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. బ్యాంకుకు అతను ఇంకా ఆరు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని భానుకు బ్యాంక్ నుంచి నోటీసు కూడా వచ్చినట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications