వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రబెల్లి ఇంటిని ముట్టడించిన కెయు జెఏసి: రాజీనామాకు డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kakatiya University
వరంగల్: వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు ఇంటిని కాకతీయ విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం ముట్టడించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించాలని వారు ఆయనను డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎర్రబెల్లి బయటకు రావాలని వారి డిమాండ్ చేశారు. ఓ సందర్భంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకోజూశారు. అయినా విద్యార్థులు తగ్గలేదు. బయటకు రావాలని విద్యార్థులు కోరడంతో ఎర్రబెల్లి దయాకరరావు బయటకు వచ్చారు.

ఎర్రబెల్లి బయటకురాగానే విద్యార్థులు ఆయన కాళ్లపై పడి తెలంగాణ కోసం పోరాడాలని కోరారు. పార్టీ వీడటం ఇష్టం లేకుంటే పార్టీలోనే ఉంటూ తెలంగాణ కోసం పోరాడాలని కోరారు. అయితే తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తాను తెలంగాణ కోసం పార్టీలో ఉండి పోరాడుతానని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి వేదికను ఏర్పాటు చేస్తే మొదటి రాజీనామా నేనే చేస్తానని ఆయన విద్యార్థులకు స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X