వెధవలు, సన్నాసులు లేరు, తెలంగాణపై వెనక్కి తగ్గలేదు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని తాము స్పష్టం చేస్తూ వస్తున్నామని, తమ పార్టీ అధిష్టానానికి అదే విషయం చెప్పామని ఆయన అన్నారు. తమ ఆలోచన మారిందనేది వాస్తవం కాదని, తెలంగాణపై తాము వెనక్కి తగ్గినట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో పార్టీ పార్లమెంటు సభ్యులందరం ఐక్యంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాజకీయ సంక్షోభం సృష్టించడం వల్ల తెలంగాణ రాదని, తెలంగాణ కోసం తాము పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు కట్టుబడి ఉండాలని తామంతా కోరుతున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ కోసం పార్టీ అధిష్టానాన్ని బ్లాక్ మొయిల్ చేయాలని తాము అనుకోవడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications