హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు మరో షాక్: రాజీనామాకు ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి సై

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి రాజీనామా యోచనలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. తాను రాజీనామా చేస్తానని హరీశ్వర్ రెడ్డి చెప్పారు. తన రాజీనామా లేఖను తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్‌కు పంపుతానని, అవసమైనప్పుడు కోదండరామ్ ఆ రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు పంపవచ్చునని ఆయన సోమవారం చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోక పోవటంతో ఆయన రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన సోమవారం తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలోని రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పటికే నిజామాబాద్ ఎమ్మెల్యే టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. టిఆర్ఎస్‌లో చేరడానికి మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా శంషాబాద్ విమానాశ్రయంలో రాజేంద్రనగర్ టిడిపి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కారును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ కోసం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేకు, తెలంగాణవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X