విస్తరిస్తున్న బాక్టీరియా మహమ్మారి..: విలవిలలాడుతున్న వన్యప్రాణులు

సింహాలు గ్లాండర్స్ (గుర్రాలకు సోకే ఒక అంటువ్యాధి) బారిన మృతి చెందినట్లు ఆ పత్రిక తెలిపింది. ఇతర జంతువులకు సైతం ఈ వ్యాధి సోకిందని, ఇది జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదముందని సదరు పత్రిక హెచ్చరించింది. జూలో వన్యప్రాణుల సంరక్షణ లోపం వల్ల సింహాలకు ఈ వ్యాధి సోకి ఉండవచ్చునని గుర్రాల వైద్యుడు హావ్‌మ్యాన్ మోలౌక్‌పౌర్ తెలిపారు. అయితే ఈ సింహాలు ఎప్పుడు మరిణించాయనే విషయాన్ని మాత్రం ఆ పత్రిక వెల్లడించలేదు.
గడచిన రెండు నెలలో ఇలాగే మూడు సింహాలు గ్లాండర్స్ వ్యాధి సోకి మరణించినట్లు ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ అంతరించిపోతున్న అటవీ మృగాలను సంరక్షించికోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మోలౌక్‌పౌర్ అభిప్రాయపడ్డారు. లేకపోతే భావితరాలకు చరిత్రలో ఓ ఘట్టంగా మిగిలిపోయిన డైనోసార్లు మాదిరిగానే పులులు, సింహాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications