జగన్ పార్టీలోకి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి

కాంగ్రెసు పార్టీలో ఉన్న కాటసాని మంత్రివర్గంలో తనకు చోటు లభించని కారణంగా జగన్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాను ముప్పయ్యేళ్లనుండి పార్టీలో ఉన్నానని ఆయన ఇదివరకే చెప్పారు. మంత్రివర్గంలో తనకు చోటు లభించనందుకు అసంతృప్తితో ఉన్నట్టు ఆయన అప్పుడే చెప్పారు. తన అనుభవాన్ని ముఖ్యమంత్రి కిరణ్ లెక్కలోకి తీసుకోలేదని ఆయన ఆవేదన చెందారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగుండేదని చెప్పారు. కాంగ్రెసులో ఉండాలా, జగన్ వైపు వెళ్లాలా ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. ఆయన కుమార్తె పెళ్లికి జగన్ వచ్చినప్పుడే ఆయన కాంగ్రెసు వీడతారనే వార్తలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications