అఖిలపక్షానికి వెళ్లడంపై పార్టీలో నిర్ణయిస్తాం: ఈటెల రాజేందర్

ఎన్ని ఒప్పందాలు ఉన్నా తెలంగాణ అన్యాయానికి గురవుతుందన్నారు. తెలంగాణకు న్యాయం చేయాలంటే నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నిత్యం పోరాటం కన్నా ప్రత్యేక తెలంగాణతోనే మాకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకుంటే రాజీనామా అన్న నేతలు ఇప్పుడు రాజీనామాలతో తెలంగాణ వస్తుందని అని అనటం విడ్డూరంగా ఉందన్నారు. శవాలపై ప్రమాణాలు చేసిన ఆ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications