భానుతో కమెడియన్ గణేష్ ‌కు లింకులు: టాలీవుడ్ చుట్టూ భాను స్టోరీ

Ganesh
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ తో టాలీవుడ్‌ కి ఉన్న సంబంధాలు రోజుకో కొత్త కోణం బయటకు వస్తున్నాయి. ఇప్పటికే భారీ నిర్మాతలు సి.కళ్యాణ్, శింగనమల రమేష్‌బాబుతో భానుకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు వీరిని విచారించారు. ఇప్పుడు మరో నిర్మాత గణేష్ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌తో భాను సంబంధాలపై పోలీసులు కూపి లాగుతున్నారు. గణేష్ చిన్న కమేడియన్ స్థాయినుండి భారీ నిర్మాతగా ఎలా ఎదిగాడనే విషయంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఒక్కో సినిమాకు లక్ష రూపాయల లోపు రెమ్యునరేషన్ తీసుకునే గణేష్ భారీ చిత్రాలు ఎలా నిర్మించాడనే కోణాన్ని పరిశీలిస్తున్నారు.

గణేష్ సినిమాలలో కమేడియన్‌గా నటించేవాడు. అయితే హీరో రవితేజతో ఇటీవల గణేష్ ఆంజనేయులు చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత మరో కొన్ని చిత్రాలు తీయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే మామూలు కమేడియన్ భారీ చిత్రాలు తీయడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయనను సిసిఎస్ పోలీసులు రెండుమూడు రోజుల్లో విచారించే అవకాశముంది. గణేష్‌కు భాను కిరణ్‌తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఓ ల్యాండ్ విషయంలో భానుకు, గణేష్‌ కు పరిజయం ఏర్పడిందని భావిస్తున్నారు. ఆ పరిచయం కాస్త పెరిగి గణేష్‌ను నిర్మాతగా ఎదిగేందుకు అవకాశం వచ్చినట్టుగా భావిస్తున్నారు. గణేష్ భానుతో కలిసి భూదందాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తదితర రంగాలలోకి గణేష్ దిగటం వల్లనే కమేడియన్‌గా తెరపై కనిపించడం లేదని భావిస్తున్నారు. మొత్తానికి పోలీసుల విచారణలో భాను గురించి కొత్త కొత్త విషయాలు తెలియడమే కాకుండా, టాలీవుడ్ చుట్టూ తిరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+