వైయస్ జగన్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాలి: వర్ల రామయ్య

మస్తాన్ రావు ఆత్మహత్య కేసును తిరిగి తెరిచి దర్యాప్తు చేపట్టాలని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్‌పై సంతకం లేకపోయినంత మాత్రాన అందులో పేర్లను విస్మరించడానికి వీలు లేదని ఆయన అన్నారు. సూసైడ్ నోట్‌లో ఉన్న పేర్లున్న అందరిపై కేసు నమోదు చేయాలని కూడా ఆయన కోరారు. న్యాయవాది శ్రీకాంత్ గౌడ్ కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో తెలియాలని ఆయన అన్నారు.
కాగా, మస్తాన్ రావు ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని న్యాయవాది శ్రీకాంత్ గౌడ్ అంటున్నారు. భాను కిరణ్, మంగలి కృష్ణ భూముల కొనుగోలు విషయంలో న్యాయ సలహాల కోసమే తన వద్దకు వచ్చేవారని ఆయన చెప్పారు. భానుకు అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డిని తానే పరిచయం చేసినట్లు ఆయన తెలిపారు. బెయిల్ వచ్చే వరకు మాత్రమే తాను సూరితో కాంటాక్టులో ఉన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications