మంత్రివర్గంలో రాష్ట్రానికి మొండిచేయి: జైపాల్ రెడ్డి శాఖ మార్పు?

మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సమాచారంతో మధుయాష్కీ, వి హనుమంతరావు, కె కేశవరావు, సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్‌యాదవ్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, కిషోర్ చంద్రదేవ్ తదితరుల పేర్లు వినిపించాయి. వారు కూడా మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. కొందరు మంత్రివర్గంలో చోటు కోసం తమతమ ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం మాత్రం రాష్ట్రానికి మొండిచేయి చూపింది. కాగా పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి శాఖను కూడా మార్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరప్ప మొయిలీ శాఖ కూడా మారనున్నట్టుగా తెలుస్తోంది. శాఖ ఇస్తే ఎంపీలకు సోనియానే స్వయంగా పోన్ చేస్తారన్న నేపథ్యంలో ఎంపీలు ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు.
కాగా కేంద్ర మంత్రివర్గంనుండి వీరభద్రసింగ్, వికె హ్యాండిక్, ఆజాద్, కమల్ నాథ్, అంబికాసోనిలను తొలగించనున్నారు. వీరిలో ఆజాద్, కమల్ నాథ్, అంబికాసోనిలకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. జనార్ధన్ ద్వివేదిని మంత్రివర్గంలోకి తీసుకొని, సురేష్ పచౌరీకి ఏఐసిసి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రణబ్, చిదంబరం శాఖలను మార్చాలని మన్మోహన్ కోరినప్పటికీ సోనియాగాంధీ అంగీకరించలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications