ఫిబ్రవరి 14 నుంచి బడ్జెట్ సమావేశాలు: నివేదిక తర్వాత మొదటి సమావేశం

Assembly
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 14వ తేదినుండి ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించిన అనంతరం తొలి సమావేశం కాబట్టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సమావేశాల తేదీలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈనెల 24న ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 12వ తేదిన రచ్చబండ కార్యక్రమం పూర్తి అవుతుంది. అది పూర్తికాగానే 14వ తేదిన బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

శ్రీకృష్ణ నివేదిక తర్వాత మొదటి సమావేశం కాబట్టి సమావేశాల్లో తెలంగాణ అంశాన్ని దాటవేయడానకి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకంటే ముందుగానే పూర్తి చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. తద్వారా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలన్న తెలంగాణ ఎమ్మెల్యేలనుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రం నుండి వీలైనంత త్వరగా వీలైనన్ని నిధులు సమకూర్చుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ సమావేశాలలో కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేల వాయిస్‌పైనే అందరి దృష్టి ఉంది.

పార్లమెంటు సమావేశాలకన్నా ముందు బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి పోరుకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. కేవలం ప్రత్యేక తెలంగాణ పాయింటుపైనే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం పడిపోతేనే తమకు అనుకూలమనే భావనతో కూడా టిఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కిరణ్ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వస్తే టిఆర్ఎస్ భారీగా సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+