బాబుతో ముదిరిన విభేదాలు, అజ్ఞాతంలోకి వెళ్తానన్న నాగం

పార్టీ ఎవరబ్బ సొత్తు కాదని, పార్టీ పెట్టినప్పటి నుంచి తాను ఉన్నానని ఆయన అన్నారు. ఎవరో పంపిస్తే తాను పార్టీ నుంచి వెళ్లిపోయేది లేదని ఆయన చెప్పారు. అవసరమైతే తాను అజ్ఞాతంలోకి వెళ్తానని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డితో మరింత మంది పార్టీ శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక శాఖ ఏర్పాటు డిమాండ్‌పై ఇంతకు ముందు పార్టీలో పుట్టిన ముసలం టీ కప్పులో తుఫానుగా తేల్చేశారు. అయితే, అది సద్దుమణగలేదని, అది గాలివానగా మారే ప్రమాదం ఉందని అర్థమవుతోంది. తాను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గబోనని, తెలంగాణ విషయంలోనూ అంతేనని నాగం అన్నారు. తెలంగాణ ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై చంద్రబాబు నాయకులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications