మీ ఫేస్‌బుక్ ఖాతాలో సమాచారం భద్రమేనా..??

ఆర్కుట్, హాయ్‌కుట్ వంటి ఎన్నో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను వెనక్కు నెట్టి ప్రస్తుతం రెండో ఇంటర్నెట్‌గా అవతరిస్తున్న ఫేస్‌బుక్‌కు ఇప్పడు పెద్ద తలనొప్పి ఎదురయ్యింది. ప్రస్తుతం ఫేస్‌బుక్ సెక్యూరిటీ రిస్క్‌లో పడిందని, ఈ సైట్‌లో ప్రైవసీ సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని ఐటి భద్రత, నియంత్రణ సంస్థ సోపోస్ పేర్కొంది. అంతే కాకుండా.. ఫేస్‌బుక్ అక్కౌంట్‌లలో నిక్షిప్తం చేసుకున్న చిరునామాలు, ఫోన్ నంబర్లను వెంటనే తొలగించుకోమని కూడా సోపోస్ సలహా ఇస్తుంది. ఫేస్‌బుక్ యూజర్ల ఆఫ్-సైట్ కాంటాక్ట్ సమాచారాన్ని ప్రోగ్రామ్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చునని ఫేస్‌బుక్ స్వయంగా ప్రకటించినట్లు సోపోస్ తెలిపింది.
వాస్తవానికి థర్డ్-పార్టీ ఫేస్‌బుక్ అప్లికేషన్లకు యూజర్ అనుమతి లేకుండా డేటానా యాక్సెస్ చేసే అవకాశం లేదు. కానీ.. ఇప్పటికే ఈ సైట్‌లో ఫేస్‌బుక్ పేరు, బ్రాండ్‌ను వాడుకొని హల్‌చల్ చేస్తున్న కొన్ని అప్లికేషన్ల ద్వారా డేటా అపహరణ గురయ్యే ఆస్కారం ఉందని సోపోసో సీనియర్ టెక్నాలజీ కన్సల్టెంట్ గ్రాహమ్ క్లూలే తెలిపారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్.
ప్రపంచం నలుమూలల నుంచీ ప్రజలు, ప్రముఖులు ఈ సైట్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని లబ్ది పొందాలనే కొందరు ప్రబుద్ధులు యూజర్లకు స్పామ్ మెసేజ్‌లను పంపడం ద్వారా వారి అక్కౌంట్‌లోకి చొరబడి సమాచారాన్ని దోచేస్తున్నారు. కాబట్టి పరిచయం లేని వారికి వీలైనంత దూరంగా ఉండటంతో పాటు స్పామ్ మెసేజ్‌లను ఓపెన్ చేయకుండా అలానే డిలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications