చిరంజీవి భేటీకి నలుగురు శానససభ్యులు డుమ్మా, వారిపై చర్యలు

కాగా, తెలంగాణకు చెందిన అనిల్, మహేశ్వర్ రెడ్డి చిరంజీవి సమైక్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరిలో మహేశ్వర రెడ్డికి పార్టీ నుంచి సమావేశానికి రావాలని ఆహ్వానం కూడా అందలేదని తెలుస్తోంది. ఇదివరకు జరిగిన సమావేశంలో మహేశ్వర రెడ్డి శాసనసభ్యులను చీల్చేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తరఫున ఆయన మధ్యవర్తిగా వ్యవహరించి ప్రజారాజ్యం శాసనసభ్యులను చీల్చాలని ప్రయత్నించారని చెబుతున్నారు. దీంతో మహేశ్వర రెడ్డిని కావాలనే చిరంజీవి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజారాజ్యం ఇప్పటికిప్పుడు చేరే అవకాశాలు లేవని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications