Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్తగా ముగ్గురే, జైపాల్ రెడ్డి శాఖ మార్పు, ఎపికి నో చాన్స్

Manmohan Singh
న్యూఢిల్లీ: స్వల్ప మార్పులతోనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తమ మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించారు. అయితే శాఖల్లో మాత్రం భారీ మార్పులు చేశారు. ముగ్గురు సహాయ మంత్రులకు ప్రమోషన్ లభించింది. ముగ్గురు సహాయ మంత్రులకు క్యాబినెట్ హోదా కల్పించారు. సహాయ మంత్రులుగా బేణీ ప్రసాద్ వర్మ, అశ్వినీ కుమార్, కెసి వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రులు ప్రఫుల్ పటేల్, సల్మాన్ ఖుర్జీద్, ప్రకాష్ జైస్వాల్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం సాయంత్రం ప్రమాణం చేయించారు.

కాగా, మంత్రివర్గం నుంచి ఎవరినీ తొలగించకపోవడం విశేషం. సహాయ మంత్రి బేణి ప్రసాద్ ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తారు. ఆయనకు ఉక్కు శాఖను కేటాయించారు. సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అశ్వినీ కుమార్‌కు పార్లమెంటరీ వ్యవహారాలు, శాస్త్రీయ విజ్ఞాన శాఖలను కేటాయించారు. మరో సహాయ మంత్రి కెసి వేణుగోపాల్‌కు విద్యుత్ శాఖను కేటాయించారు. తృణమూల్ కాంగ్రెసు నుంచి గానీ డిఎంకె నుంచి గానీ మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోలేదు.

క్యాబినెట్ హోదా లభించిన ప్రఫుల్ కుమార్ భారీ పరిశ్రమలు, ప్రకాష్ జైస్వాల్ బొగ్గు గనులు, సల్మాన్ ఖుర్షీద్ మైనారిటీ వ్యవహారాల శాఖలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్ జైపాల్ రెడ్డిని పట్టణాభివృద్ధి శాఖ నుంచి మంత్రిత్వ శాఖను మార్చారు. కొత్తగా ఎవరికీ రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మురళీ దేవరాకు కార్పోరేట్ శాఖను, సిపి జోషీకి రోడ్లు, జాతీయ రహదారుల శాఖను కేటాయించారు.

వాయలార్ రవికి పౌర విమాన యానాల శాఖ కేటాయించారు. రాష్ట్రానికి చెందిన సహాయ మంత్రి సాయిప్రతాప్‌కు భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. విలాస్ రావు దేశ్‌ముఖ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ లభించింది. టెలికం, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కపిల్ సిబల్ ఎప్పటిలాగే నిర్వహిస్తారు. ఆర్థిక, హోం, విదేశీవ్యవహారాల శాఖల్లో మార్పు చేయలేదు. ఎంఎస్ గిల్ గణాంక శాఖను నిర్వహిస్తారు.

సహాయ మంత్రులు అజయ్ మేకన్, థామస్‌లకు స్వతంత్ర హోదా ఇచ్చారు. కమలనాథ్‌కు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. న్యాయశాఖ నుంచి వీరప్ప మొయిలీని మార్చలేదు. జైరాం రమేష్‌ను పర్యావరణ శాఖ నుంచి మార్చలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+