బాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ ద్వారా భాను కిరణ్ పెట్టుబడులు?

రక్తచరిత్ర సినిమాకు కోట్ల రూపాయలు వర్మకు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. వర్మ ఖాతాలో పడిన డబ్బులు సూరి భాను కిరణ్ ద్వారా వేశాడా, భాను స్వయంగా వేశాడా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రక్త చరిత్ర సినిమాకు ముందు నుంచే భాను కిరణ్ తో వర్మకు సంబంధాలున్నట్లు చెబుతున్నారు. వర్మ ద్వారా భాను కిరణ్ బాలీవుడ్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు ఓ టీవీ చానెల్‌లో వార్త వచ్చింది. వర్మను పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో విచారించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications