వైయస్ జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతాడు: లగడపాటి

Lagadapati Rajagopal
కర్నూలు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌ రెడ్డి వెంట వెళుతున్న శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందనే మాటలలో నిజం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం కర్నూలులో అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై పార్టీ చర్యలు తీసుకుంటుందనే వార్తలు అంతా మీడియా సృష్టి అని కొట్టి పారేశారు. పార్టీ అధిష్టానానికి వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదన్నారు. వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు మాత్రమే కాదని, ఆయన కాంగ్రెసు పార్టీలోనే ఎప్పటికైనా సభ్యుడన్నారు.

2014 ఎన్నికల వరకు జగన్ కాంగ్రెసులోకి తిరిగి వస్తారని చెప్పారు. సమైక్యాంధ్ర విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికకే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నివేదిక తయాలు చేశారని, ఆ నివేదికకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+