భాను కిరణ్‌ తో లింకులు లేవు: మీడియా వార్తలను కొట్టిపారేసిన గణేష్

Ganesh
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్యలో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత గణేష్ గురువారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. తనకు భానుతో ఎలాంటి పరిచయాలు లేవని చెప్పారు. తన పేరును ఇవ్వకుండా తన ఫోటోను చూపించి కొన్ని మీడియాలు తనకు భాను కిరణ్‌ తో సంబంధాలు ఉన్నాయని, రియల్ దందాలు కూడా నడిపినట్టు వార్తలు ఇస్తున్నాయని, వాటిపై తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.

తనపై మీడియా అనసరంగా ఆరోపణలు వేస్తుందన్నారు. ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రజలకు తెలియజేయాలన్నారు. తాను మిస్టర్ క్లీన్‌నని చెప్పారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తన జీవితాన్ని అనవసరంగా వివాదంలోకి లాగవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. చిన్నచిన్నగా ఎదుగుతున్నానని చెప్పారు. తనను అనవసరంగా అనవసర వివాదాల్లోకి లాగవద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+