నిర్మాత శింగనమల రమేష్ కోసం గాలింపు నోటీసులు జారీ

Singamala Ramesh
హైదరాబాద్: సినీ నిర్మాత శింగనమల రమేశ్‌పై సీసీఎస్‌ అధికారులు గాలింపు (లుక్‌అవుట్‌) నోటీసులు జారీచేశారు. సినీ ఫైనాన్షియర్‌ వైజయంతీరెడ్డి ఫిర్యాదు మేరకు శింగనమల, భానుకిరణ్‌లపై కేసు నమోదు చేసిన సీసీఎస్‌ అధికారులు శింగనమలను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అతను దొరకలేదు. చెన్నైలో ఉన్నాడన్న సమాచారంతో ఫోన్‌ చేసినా ఫలితం లేదు.

దీంతో ఇతరదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో శంషాబాద్‌ విమానాశ్రయం సహ దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు లేఖలు పంపారు. మరోవైపు భానుకిరణ్‌ మంచిరేవులలో కొన్న భూమిలో భాగస్వామిగా ఉన్న న్యాయవాది శ్రీకాంత్‌గౌడ్‌ను సీసీఎస్‌ పోలీసులు బుధవారం ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+