వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్‌ బెర్రీ మొబైల్ ఫోన్లలో అశ్లీల వెబ్‌ సైట్ ‌లను నిషేధించిన రిమ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Black Berry Mobile
జకార్తా: గత కొద్దికాలంగా వివాదాల్లో చిక్కుకున్న బ్లాక్‌బెర్రీకు మరో సమస్య తలెత్తింది. ఇకపై బ్లాక్‌బెర్రీ ఫోన్లలో అశ్లీల వెబ్‌సైట్లను యూజర్లు యాక్సెస్ చేయకుండా ఉండేలా, అటువంటి సైట్లను తక్షణమే నిషేధించాలని బ్లాక్‌బెర్రీ ఫోన్ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) నిర్ణయించింది. ఇండోనేషియా ప్రభుత్వం నుంచి బెదిరింపులు రావడంతో రిమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండోనేషియా ప్రభుత్వం బ్లాక్‌బెర్రీ తయారీదారులకు హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 21 నాటికి బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్లలో అశ్లీల వెబ్‌సైట్‌లను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది.

ఈ విషయంపై బ్లాక్‌బెర్రీ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ..ఇండోనేషియా నియంత్రణల మేరకు మొబైల్ ఫోన్లలో అశ్లీల సైట్లను ఫిల్టర్ చేసేందుకు రిమ్ కసరత్తలు మొదలుపెట్టిందని చెప్పారు. ఇండోనేషియా మార్కెట్లో పెట్టుబడులు పెట్టడాన్ని రిమ్ కొనసాగిస్తుందని, తమ వినియోగదారులకు, డెవలపర్లకు, పంపిణీ భాగస్వాములకు మద్దతివ్వడాన్ని కొనసాగిస్తామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. బ్లాక్‌బెర్రీ ఫోన్లో ఇండోనేషియన్లు ప్లేబాయ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా.. "మీరు ప్రయత్నిస్తున్న సైట్ ఈ నెట్‌వర్క్ ద్వారా యాక్సెస్ చేయడం వీలుకాదు" అనే సందేశం మొబైల్ తెరపై ప్రత్యక్షమైంది.

కాగా.. రిమ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండోనేషియా సమాచార శాఖా మంత్రి తిఫతుల్ సెంబిరింగ్ ప్రశంసిస్తూ తన ట్విట్టర్ బ్లాగ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇండోనేషియా చట్టాలను, నియంత్రణలను రిమ్ చక్కగా పాటించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

English summary
Now, no more access to porn sites in BlackBerry mobiles. This is an urgent move made by the Research in Motion (RIM) following a threat from Indonesian government. Black Berry makers received warning from Indonesian government and took the step by blocking the porn sites from its phone before the deadline, Friday, Jan 21, given by the government of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X