రాజీనామాలు చేస్తే తెలంగాణ తన్నుకుంటూ వస్తుంది..: కెసిఆర్

తెలంగాణలో ఉండే కాంగ్రెస్, తెదేపా నాయకులపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారంతా పదవుల కోసం పాకులాడే దద్దమ్మలని, అందువల్లనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకాలు కలుగుతున్నాయని కేసీర్ అన్నారు. ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టకపోతే సహాయనిరాకరణ ఉద్యమం మొదలుపెడతామని కెసిఆర్ హెచ్చరించారు. తెలంగాణావాదుల ఆకాంక్షను అర్థం చేసుకుని కేంద్రం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణలోని జిల్లాల్లో మరోసారి రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తెలంగాణ రిలే నిరాహార దీక్షలను తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ప్రారంభించారు. తెలంగాణ వచ్చే వరకూ ఈ దీక్షలు ఇలానే కొనసాగుతాయని, తమకు ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కావాలని, వేరే ఏ రీజనల్ కమిటీలు అవసరం లేదని కోదండరామ్ చెప్పారు.












Click it and Unblock the Notifications