తెలంగాణపై ఇంకా ఏం ఆలోచిస్తారు: ప్రధానిని ప్రశ్నించిన కె. చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
మహబూబ్‌ నగర్: తెలంగాణకోసం ఎన్ని కమిటీలు వేస్తారు? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇంకేం ఆలోచిస్తారని ప్రధాన మంత్రిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె చంద్రశేఖర రావు ప్రశ్నించారు. గురువారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ, "తెలంగాణ ప్రజల సహనాన్ని ఎంతకాలం పరీక్షిస్తారు? 2004 ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన ప్రకటన ఏమైంది? ప్రణబ్ కమిటీ ఏమి తేల్చింది?'' అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు తక్షణం పదవులకు రాజీనామాలు చేసి చరిత్ర నిర్మాతలుగా మిగిలిపోవాలన్నారు.

తెలంగాణ కోసం కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలా? వద్దా? అని కేసీఆర్ సభకు వచ్చినవారిని ప్రశ్నించగా, వారంతా చేయాల్సిందేనంటూ ముక్తకంఠంతో చేతులెత్తి మద్దతు పలికారు. తాము రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా? అంటూ వంకర సమాధానాలు ఇస్తూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారని, రాజీనామా చేస్తే.. తెలంగాణ ఎట్లా రాదో తాము చూపిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సీమాంధ్రనాయకులు తమ రాజీనామాలతో తెలంగాణను అడ్డుకున్నారని ఆయన పేర్కొంటూ, అదే అస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించాలని తెలంగాణ నేతలకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+