హీరోతో ప్రేమాయణం నడిపి, అతన్ని కొట్టించిన శ్వేతారెడ్డి?

శ్వేతారెడ్డి ఈ హీరోను మద్దెలచెర్వు సూరి ముఠాతో కొట్టించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ హీరో హైదరాబాదు వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఆ హీరో ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడని కూడా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం శ్వేతారెడ్డి సోదరుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూరి తనకు మేనమామ అంటూ శ్వేతారెడ్డి తాను పనిచేసే కార్యాలయంలో కూడా చెప్పుకునేది అంటున్నారు. అనంతపురం జిల్లాలోని తన ఆస్తులను సూరి శ్వేతారెడ్డి పేరు మీదనే పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో పలు చోట్ల భాను కిరణ్ ఆమె పేర పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. శ్వేతారెడ్డి సూరికి బంధువని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications