వైయస్ జగన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎదురుదాడి

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి గానీ వైయస్ జగన్‌కు గానీ కాంగ్రెసు పార్టీ అన్యాయం చేయలేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా కాంగ్రెసు నాయకత్వానికి వ్యతిరేకంగా, సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు పార్లమెంటు సభ్యుడిగా పార్టీ అవకాశం ఇచ్చిందని, వైయస్సార్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని, ప్రస్తుత మంత్రిగా ఉన్న వైయస్ వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని, అంతకు ముందు వివేకానంద రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కింద పోటీ చేసి గెలిచిన శానససభ్యులు జగన్ వెంట వెళ్లడం అనైతికమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications