హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో తెలుగు సినీ నిర్మాతకూ గుట్కా డీలర్‌కూ భాను కిరణ్‌తో లింక్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ సంబంధాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే భానుతో ఇద్దరు నిర్మాతల సంబంధాలు బయటకు వచ్చాయి. మరొక నిర్మాత, హైదరాబాద్‌లో గుట్కా వ్యాపారం నిర్వహించే అతి పెద్ద డీలర్‌, ఫైనాన్షియర్‌ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. వారికి సూరితోనూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. సూరి బంధువని చెప్పుకొంటున్న టీవీ ఛానెల్‌ యాంకర్‌ కుటుంబసభ్యుల్లో మరొకరిపై కూడా పోలీస్‌ నిఘా ఉన్నట్టు సమాచారం.భాను కిరణ్ ఒంటరిగానే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటేంతవరకూ సహచరుల సాయం తీసుకున్న భాను అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో రెండు రహస్య ప్రాంతాలను ఎంపిక చేసుకుని కొద్దిరోజులు అక్కడ, కొద్దిరోజులు ఇక్కడ ఉంటున్నాడని తెలిసింది. పోలీసులు మాత్రం భాను కిరణ్‌ ఆచూకీ కోసం లక్ష్యం దిశగా సాగకుండా పొదల చుట్టూ వెతుకుతున్నారు.

భాను కిరణ్‌ గతంలో వ్యవహరించిన తీరు, పోలీసులు, రాజకీయ నేతలతో సంబంధాలు, మొద్దుశీనుతో పాటు అనంతపురం జిల్లాలో రౌడీల పరిచయాలు, ఏడాది క్రితం పోలీసులకు పట్టుబడ్డప్పుడు కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో సంబంధాలు ఇవన్నీ భాను తప్పించుకునేందుకు ఉపకరించాయి. బెయిల్‌పై విడుదలైనా...నగరానికి చెందిన కొందరు పోలీసు అధికారులతో భాను సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కొందరు సిబ్బందికి అవసరమైనప్పుడు ఆర్థిక సాయం చేస్తున్నాడు. దీంతోపాటు సూరికి బెయిల్‌ ఇప్పించేందుకు అనంతపురం, హైదరాబాద్‌, ఢిల్లీలకు తరచూ వెళ్లడం, ఆ సందర్భంగా న్యాయవాదులతో మాట్లాడ్డం భానుకు తార్కికజ్ఞానాన్ని పెంచాయి. అందుకే తనకున్న తెలివి, పరిజ్ఞానంతో అత్యంత తేలిగ్గా పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. సుబ్బు, మన్మోహన్‌లతో వెళ్లిన భానుకిరణ్‌ సురక్షిత ప్రాంతానికి దగ్గరవగానే వారిని కూడా తప్పించాడు. ఒంటరిగానే అజ్ఞాతంలో ఉంటున్నాడు. అయితే పోలీసులు మాత్రం లక్ష్యం దిశగా కాకుండా ఫలానా చోటికి వెళ్లుంటాడన్న అనుమానంతో ప్రత్యేక బృందాలను పంపించడం, అక్కడ లేకపోతే తిరిగిరావడం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X