తెలంగాణ పోరుకేకలో స్టెప్పులేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

తెలంగాణవాదాన్ని పక్కదోవ పట్టించడానికే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అయితే రచ్చబండను తెలంగాణ వాదానికి అనుకూలంగా వినియోగించుకోవాలని ఆయన తెలంగాణవాదులకు సూచించారు. తెలంగాణపై కేంద్రం కాలాయాపన చేయవద్దని అన్నారు. టైంపాస్ వ్యవహారాలు మానుకొని తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా ప్రత్యేక తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యకర్తలు వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలో కలెక్టరేట్లను కూడా ముట్టడించారు.












Click it and Unblock the Notifications