రచ్చబండ వాయిదా వేయాలన్న జీవన్ రెడ్డి, అడ్డుకోవద్దన్న శ్రీధర్ బాబు

కాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. తెలంగాణలో కాంగ్రెసును బతికించుకోవాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందేనని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని కేంద్రం తెలంగాణ ప్రకటించే వరకు వాయిదా వేసుకోవాలని కోరారు. రచ్చబండను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వానికి మేం ముందే విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. ఈ రోజు జరిగిన పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పార్టీ పరువు తీసేలో ప్రభుత్వం చర్యలున్నాయని అన్నారు.
తెలంగాణ ఉద్యమం కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సొత్తో లేక ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సొత్తో కాదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు పార్టీలోని నేతలు కూడా పోరాటం చేస్తున్నారన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణవాదులపై దాడి చేయడం, కెసిఆర్ మీటింగ్‌ను అడ్డుకుంటానని చెప్పడంపైనా జీవన్‌రెడ్డి స్పందించారు. కెసిఆర్, జగ్గారెడ్డిల గొడవ వారి వ్యక్తిగతమన్నారు.












Click it and Unblock the Notifications