విడివిడిగా బాబాయ్ వివేకానంద, అబ్బాయ్ జగన్: జయమ్మకు నివాళులు

YS Jagan-YS Vivekananda Reddy
కడప: వ్యవసాయశాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య విభజన రేఖ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తల్లి వైయస్ జయమ్మ వర్ధంతి సభలో మంగళవారం స్పష్టంగా కనిపించింది. వైయస్ జయమ్మ వర్ధంతి సందర్భంగా మంగళవారం వివేకానంద, జగన్ వేరువేరుగా వచ్చి ఇడుపులపాయలో ఉన్న ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. దీంతో బాబాయ్, అబ్బాయ్ మధ్య విభజన స్పష్టంగా కనిపించింది. ఇంతకుముందు ఏ కుటుంబ కార్యక్రమం జరిగినా వైయస్ కుటుంబం కలిసి నిర్వహించుకునేవి. కానీ మొదటిసారి ఇద్దరు వేరువేరుగా వచ్చారు.

వైయస్ వివేకానంద గతంలోనే జగన్ పార్టీ విడిపిచి పెట్టిన తర్వాత ఇకనుండి పార్టీ కార్యక్రమాలలో కలిసి పాల్గొనని స్పష్టం చేశారు. ఆయన అన్నట్లుగానే ఇప్పుడు వేరుగా పాల్గొన్నారు. జయమ్మ వర్ధంతి వేడుకలకు కూడా బాబాయ్, అబ్బాయ్‌లు వేరువేరుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+