వైయస్ జగన్‌ను కాంగ్రెసులోకి తెచ్చేందుకు యత్నాలు, కిరణ్ వ్యతిరేక పాత్ర?

సబ్బం హరి కాంగ్రెసులో ఉంటూనే వైయస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. జగన్ పట్ల కొంత మంది రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తిరిగి కాంగ్రెసులోకి రాకూడదనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మాట్లాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. వి హనుమంతరావు వంటి కాంగ్రెసు సీనియర్ నేతలు కొంత మంది కూడా జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో కాంగ్రెసుకు, సోనియాకు, రాహుల్‌కు వ్యతిరేకంగా వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ స్థితిలో వైయస్ జగన్‌ను తిరిగి పార్టీలోకి తెచ్చే సబ్బం హరిలాంటి ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది అనుమానమే.












Click it and Unblock the Notifications