తెలంగాణ తెచ్చుకోవడం తెలుసు, కెసిఆర్ తెలంగాణను మరిచారు: నాగం

కేంద్రం ప్రభుత్వంపై పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తెలంగాణలో తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేద్దామని అనుకున్నా, ఉద్యమంలో టిడిపిని పక్కన పెడుదామని అనుకున్నా ఉద్యమానికి అర్థం ఉండదన్నారు. టిడిపి తెలంగాణ ఫోరం తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగామ కోసం అందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగస్తులు అయినా, తెలంగాణ కోసం పాటుపడే రాజకీయ నాయకులు అయినా కలిసి రావాలని అన్నారు. టిడిపితో ఎవరైనా కలిసి వస్తే పోరాడుతామన్నారు.
కెసిఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి తెలంగాణను మరిచారన్నారు. కెసిఆర్ తెలంగాణ కోసం ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేయాలన్నారు. ప్రభుత్వం రచ్చబండను కొనసాగించడం మంచిది కాదన్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణపై రాయపాటి, లగడపాటిలు మాట్లాడకుంటే మంచిది అని సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం కొందరి ఆస్తుల పరిరక్షణకే అన్నారు.












Click it and Unblock the Notifications