కిరణ్‌ కుమార్ రెడ్డి రచ్చబండలో వైయస్ జగన్ వర్గం రచ్చరచ్చ

YS Jagan
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న వైయస్ జగన్ వర్గీయులు కొందరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి గో బ్యాక్, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

సోమవారం పరిటాల రవి హత్య కేసులో ముఖ్యమంత్రి కిరణ్ జగన్‌పై అనవసర ఆరోపణలు చేశారన్నారు. వారు జగన్‌కు అనుకూలంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయిన వారు వెనక్కి తగ్గక పోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+