బిజెపి, టిఆర్ఎస్ ఒకటే, కెసిఆర్ భాష బాగా లేదు: ఎమ్మెల్సీ పొంగలేటి

తెలంగాణ కోసం అంటూ టిఆర్ఎస్ ఆధ్యక్షుడు కె చంద్రశేఖరరావు భాష అవమానకరంగా ఉందన్నారు. టిఆర్ఎస్ కెసిఆర్ కుటుంబ పార్టీగా మారిందని చెప్పారు.. భారతీయ జనతా పార్టీ కూడా టిఆర్ఎస్ దారిలోనే వెళుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జెండా ఎగురవేయాలన్న బిజెపి అత్యుత్సాహం కూడా టిఆర్ఎస్ లాంటిదేనన్నారు. గాడ్సే విధానాలను బిజెపి అవలంభిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో నేతలు హీరోలు కాదని, విద్యార్థులే హీరోలు అన్నారు. కాగా గణతంత్ర వేడుకల జరుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లోకి తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యకర్తలు చొచ్చుకు వచ్చారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దానికి పొంగలేటి స్పందించారు.












Click it and Unblock the Notifications