బాలకృష్ణ తడాఖా: సినిమా షూటింగ్ కోసం రిజర్వాయర్ పూడ్చివేత

సినిమా షూటింగుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రోజుకు ఐదు వేల అద్దె చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే, ఏ విధమైన మార్పులు చేయకుండా ఉన్న వాతావరణం, పరిస్థితుల్లోనే షూటింగ్ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అభయారణ్యంలో ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకూడదని, చెట్లు నరక్కూడదనే నిబంధనలను ఉల్లంఘించి షూటింగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పర్యావరణవేత్తలు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి వారు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా తమకేమీ తెలియదని అధికారులు బుకాయిస్తున్నారు. తాము షూటింగుకు అనుమతి ఇచ్చామే తప్ప అభయారణ్యంలో ఇతరేతర కార్యకలాపాలకు అనుమతి ఇవ్వలేదని వారంటున్నారు.












Click it and Unblock the Notifications