కిరణ్‌ను విమర్శించిన ఎంపీ సబ్బం హరిపై విశాఖ ఎమ్మెల్యేల ఫైర్

ఎంపీ పదవికి సబ్బం అనర్హుడు అని ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఆయన పేరును కూడా మేం ఉచ్చరించమని చెప్పారు. మరో ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ మరో అడుగు ముందుకేసి సబ్బం హరి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీనుండి గెలవలేదనుకుంటే వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ జెండా లేకుండా మళ్లీ పోటీ చేయాలన్నారు. ఆయన పోటీ చేసి గెలిస్తే గుండు గీయించుకొని తిరుగుతానని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ దూరం కావడంలో సబ్బం హరి పాత్ర కూడా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications