వ్యభిచారం చేయాలని కోడలిపై కిరాతక మామ ఒత్తిడి

West Godavari
ఏలూరు: కన్నతండ్రిలా చూసుకోవాల్సిన ఓ మామ తన కోడలిని, మనవరాలిని వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నాలు చేసిన కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది. శ్రీరామమూర్తి అనే ఓ కీచకుడు తన తనయుడి భార్యను వ్యభిచార రొంపిలోకి దించడానికి ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ కోడలు మామను చితకబాది చివరకు పోలీసులకు అప్పగించింది. తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీరామమూర్తి కుమారుడి భార్య పార్వతి. ఆమెకు యుక్త వయసుకు వచ్చిన కూతురు, ఓ కొడుకు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోయాడు. దీంతో పార్వతి మరో పెళ్లి చేసుకుంది.

అయితే యుక్తవయసుకు వచ్చిన తన కూతురు పెళ్లి విషయంపై మాట్లాడటానికి తన మొదటి భర్త తండ్రి అయిన శ్రీరామమూర్తి దగ్గరకు వచ్చింది. బుధవారం సాయంత్రం కూడా కూతురు పెళ్లి విషయమై మాట్లాడడానికి వచ్చింది. అయితే మామ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టి వారిని వ్యభిచార వృత్తిలోకి వెళ్లమని సూచించినట్లు వారు ఆరోపిస్తున్నారు. వ్యభిచార వృత్తిలోకి వెళితే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చునని ఆయన చెప్పినట్టుగా చెబుతున్నారు. తాను కుమార్తె పెళ్లి విషయంపై మాట్లాడటానికి వస్తే తనను, తన కూతురిని వ్యభిచార వృత్తిలోకి రమ్మనడంపై ఆగ్రహం చెందిన పార్వతి మామను చితక్కొట్టి పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+