ట్రైవ్యాలీలోని తెలుగు విద్యార్థులను ఆదుకుంటాం: తానా జయరామ్

విశ్వవిద్యాలయం మూతపడటంతో విద్యార్థులు సమస్యల్లో పడ్డారని, అయితే వేరే విశ్వవిద్యాలయంలోకి వారిని మార్చే విషయంపై ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అయితే విద్యార్థులు తమ ఆప్షన్ చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాలను తానా వెబ్‌సైట్లో కూడా పెట్టామని చెప్పారు. ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేదు కాబట్టి ప్రియారిటీగా తీసుకుంటామని, సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
యూనివర్శిటీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసున్నారన్నారు. విచారణ కోసమే వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అయితే వారికి బ్రెస్‌లెట్లు వేశారని, అది మాత్రం సరికాదన్నారు. విద్యార్థులకు వాటిని వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని కూడా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. అనుకోకుండా ఆ విశ్వవిద్యాలయంలో చేరి నష్టపోవడం మన బ్యాడ్ లక్ అనుకోవాలన్నారు.


Click it and Unblock the Notifications