నాపై ఆరోపణలు అబద్ధం: పరిటాల హత్య కేసుపై మంగలి కృష్ణ

Varla Ramaiah
హైదరాబాద్: పరిటాల రవి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధమని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అనుచరుడిగా చెబుతున్న మంగలి కృష్ణ అన్నారు. పరిటాల రవి హత్య కేసులో వైయస్ జగన్ పురమాయింపు మేరకు మంగలి కృష్ణ ధనసహాయం చేసినట్లు ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో వార్త వచ్చిన విషయం తెలిసిందే. తాను రెండు రోజుల పాటు సిబిఐ విచారణకు హాజరయ్యాయనని, ఇది అప్పట్లో పత్రికల్లో కూడా వచ్చిందని ఆయన అన్నారు.

కాగా, పరిటాల రవి హత్య కేసు విచారణను అనంతపురం కోర్టులో ఆపించి, తిరిగి కేసు దర్యాప్తు చేపట్టాలని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పరిటాల రవి హత్య కేసును తిరిగి తెరిచి దర్యాప్తు చేపట్టాలని ఆయన అన్నారు. పరిటాల హత్య కేసులో నిజమైన నేరస్థులు బయటకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+